BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 03 July 2026, 10:54 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయండి నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న ఆదేశం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 10:54 AM
130 వీక్షణలు


చాట్రాయి, జులై 3: రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి పూర్తయిన గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సిద్ధం కావాలని నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రీ సర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో 60 శాతానికి పైగా ప్రక్రియ పూర్తయిన రైతుల జాబితాను సిద్ధం చేసి, వారికి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సూచించారు. జులై నెలలోనే రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.

రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాల్లో రీ సర్వేకు సంబంధించి నిర్లక్ష్యం లేదా ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు.

ఈ సమావేశంలో తహసీల్దార్ శ్వేత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, గ్రామ రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.