BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 03 July 2026, 10:54 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో ఉచిత క్యాన్సర్ శిబిరానికి విశేష స్పందన.. 150 మందికి పైగా వైద్య పరీక్షలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 10:54 AM
160 వీక్షణలు

చాట్రాయి, జులై 2: గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో రోటరీ క్లబ్ నూజివీడు టౌన్, రోటరీ కమ్యూనిటీ సర్వీసెస్ నూజివీడు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నిపుణులైన వైద్య బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 150 మందికి పైగా ప్రజలు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.

ఉదయం నుంచే శిబిరం వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యాన్సర్‌కు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు, వ్యాధి లక్షణాలు, జాగ్రత్తలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అవసరమైన వారికి తదుపరి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ ప్రత్యేక సలహాలు అందించారు.

క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయిలో నయం చేసే అవకాశాలు అధికంగా ఉంటాయని వైద్య నిపుణులు తెలిపారు. జీవనశైలిలో మార్పులు, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, సరైన ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం, ముందస్తు పరీక్షల ద్వారా ప్రాణాపాయ పరిస్థితులను నివారించడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ప్రజల నుంచి లభించిన విశేష స్పందన తమకు మరింత సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రేరణనిచ్చిందన్నారు.

ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు బోయపాటి ముఖర్జీ, శశికాంత్, ఎం. శ్రీనివాస్, మండా శ్రీనివాసరావు, యార్లగడ్డ రాజగోపాల్, పైడి అనిల్ కుమార్, శోభనాద్రి తదితరులు పాల్గొన్నారు. బసవతారకం ఆసుపత్రికి చెందిన డాక్టర్ రవి సుకుమార్, డాక్టర్ శ్రీవల్లి, డాక్టర్ సురేఖ తదితరులు వైద్య సేవలు అందించి శిబిరాన్ని విజయవంతం చేశారు.