BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 03 July 2026, 02:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బూరుగుగూడెంలో దెబ్బతిన్న డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేసిన స్పెషల్ ఆఫీసర్ మాసగిరి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 02:30 PM
305 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలోని బీసీ ఏరియా రేషన్ షాపు వద్ద డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని మురుగునీరు ఆర్ అండ్ బి రోడ్డుపైకి పొంగిపొర్లుతోంది. రోజుల తరబడి మురుగునీరు రోడ్డుపై నిల్వ ఉండటంతో రహదారి క్రమంగా దెబ్బతింటూ చెరువును తలపించేలా మారింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, గ్రామ ప్రజలు పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఈ పరిస్థితిని గమనించిన పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మాసగిరి శ్రీనివాసరావు ఘటన స్థలాన్ని పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ నిర్లక్ష్యంతో రహదారి ధ్వంసమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని పంచాయతీ కార్యదర్శి రాజగోపాల్‌ను ఆదేశించారు. ఇకపై ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే అంశాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.