BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 03 July 2026, 05:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

44 ఏళ్ల సేవలకు ముగింపు.. అంగన్వాడీ కార్యకర్త సుశీలకు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 05:43 PM
282 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెద్దకొమిర 89వ కోడ్ అంగన్వాడీ కేంద్రంలో 44 ఏళ్ల పాటు విశిష్ట సేవలందించిన అంగన్వాడీ కార్యకర్త సుశీల గత నెల 30న పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఐసీడీఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో పెద్దకొమిర గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఆమెను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో విశ్రాంత సూపర్వైజర్లు గౌస్యబేగం, మునిలక్ష్మి మాట్లాడుతూ సుశీల నాలుగు దశాబ్దాలకు పైగా చిన్నారుల విద్యాభివృద్ధి, పోషకాహార కార్యక్రమాలు, గర్భిణులు, బాలింతల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజలకు చేరవేయడంలో ఆమె సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా టాటా ట్రస్ట్ సభ్యుడు రమేష్, మాజీ సర్పంచ్ వేముల కస్తూరి, మండల టీడీపీ నాయకులు దిరిశాల వెంకట కృష్ణారావు, రేగళ్ల వీరారెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు కోట దాసు, సెంటర్ లీడర్ ఏ. ఉషారాణి, వివిధ కేంద్రాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు సుశీలకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

సుదీర్ఘకాలం ప్రజాసేవలో నిలిచిన సుశీల సేవలను గ్రామస్తులు ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటూ, ఆమెకు పదవీ విరమణ అనంతర జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.