BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 04 July 2026, 02:52 pm
Posted by : JP.NAGIREDDY

పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి

ఆంధ్రప్రదేశ్
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
04 Jul, 2026 - 02:52 PM
101 వీక్షణలు

అన్నమయ్య జిల్లా: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నమయ్య జిల్లా ప్రత్యేక అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి డా. కె. సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కలికిరి మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.

విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంపొందించడం అవసరమని, ప్రతి విద్యాసంస్థలో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేశారు.