BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 05 July 2026, 08:57 pm
Posted by : కూనురు మధు

మునుగోడులో కంటి సమస్యల్లేని నియోజకవర్గమే లక్ష్యం : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
05 Jul, 2026 - 08:57 PM
92 వీక్షణలు

సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15వ ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం 

ఇప్పటివరకు 2,325 మందికి విజయవంతంగా ఉచిత ఆపరేషన్లు

చౌటుప్పల్ : మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడొద్దని, ప్రతి ఒక్కరికీ ఉచితంగా వైద్యం చేయించే బాధ్యత నాదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం చౌటుప్పల్‌లో 'కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్', ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన 15వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో 10,000 మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని, ఈ శిబిరాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని తెలిపారు. "మీకు నేనున్నా.. ధైర్యంగా వెళ్లి ఆపరేషన్ చేయించుకోండి" అని లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా ఇచ్చారు.​రూపాయి ఖర్చు లేకుండా..గత 14 విడతల్లో మొత్తం 10,444 మందికి కంటి పరీక్షలు చేసి, 4,557 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశామని, 2,325 మందికి విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి చేయించామని ఆయన వివరించారు. ఈరోజు జరిగిన 15వ విడత శిబిరంలో 1,210 మందికి పరీక్షలు నిర్వహించగా, 208 మందికి పైగా ఆపరేషన్లకు ఎంపికయ్యారు. వీరందరికీ ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు