రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
రామన్నపేట
యాదాద్రి భువనగిరి జిల్లా | రామన్నపేట | NTODAY NEWS
రజక వృత్తిదారుల సంఘం రామన్నపేట మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్య ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతితో సంఘ నాయకులు తీవ్ర విషాదంతో.
బిక్షమయ్య పార్థివ దేహానికి రజక వృత్తిదారుల సంఘం మండల కమిటీ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సంఘానికి అందించిన సేవలను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు, కార్యదర్శి, మండల కమిటీ సభ్యులు, మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొని బిక్షమయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.