BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 06 July 2026, 01:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆర్టీఐ వివరాలు ఇవ్వని ఎంఈవోకు జరిమానా

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 01:19 PM
123 వీక్షణలు

హయత్నగర్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరిన వివరాలను నిర్ణీత గడువులో అందించకపోవడంతో హయత్నగర్ మండల విద్యాధికారి (ఎంఈవో) కర్నె శ్రీనివాస్‌కు రాష్ట్ర సమాచార కమిషన్ షాక్ ఇచ్చింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.5 వేల జరిమానా విధిస్తూ ఆర్టీఐ కమిషనర్ దేశాల భూపాల్ ఆదేశాలు జారీ చేశారు.

హయత్నగర్‌కు చెందిన అడ్వకేట్, ఆర్టీఐ కార్యకర్త మహేశ్‌బాబు చొల్లేటి ఎంఈవో కార్యాలయం నుంచి కొన్ని వివరాలు కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే గడువు ముగిసినా సమాచారం అందించకపోవడంతో ఆయన రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు.

శనివారం జరిగిన విచారణలో దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వడంలో ఎంఈవో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కమిషన్ నిర్ధారించింది. దీంతో రూ.5 వేల జరిమానా విధించగా, ఆ మొత్తాన్ని ఎంఈవో అక్కడికక్కడే ఫోన్‌పే ద్వారా చెల్లించారు.

సమాచార హక్కు చట్టం కింద కోరిన వివరాలను ఇవ్వకుండా కాలయాపన చేసే అధికారులకు ఈ తీర్పు హెచ్చరికగా నిలుస్తుందని రాష్ట్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది.