BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 09 July 2026, 01:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భగవానుపురంలో గోమాత ఫోటోల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jul, 2026 - 01:36 PM
280 వీక్షణలు

గంపలగూడెం మండలంలో ఇప్పటివరకు 170 గోమాత ఫోటోలు పంపిణీ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తునికిపాడు శివారు గ్రామమైన భగవానుపురంలో గురువారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు గోమాత ఫోటోలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, హిందూ సనాతన ధర్మంలో గోమాతకు విశిష్టమైన స్థానం ఉందన్నారు. గోవును పూజించడం అంటే సకల దేవతలను పూజించినట్లేనని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా గోవును పూజించే అవకాశం లేని వారు గోమాత ఫోటోను ఇంట్లో ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజించవచ్చని తెలిపారు.

అనంతరం పెనుగొలను శిరిడి సాయిబాబా మందిరంలో కూడా భక్తులకు గోమాత ఫోటోలు పంపిణీ చేశారు. గంపలగూడెం మండలానికి చెందిన దాత కుందా కోటేశ్వరరావు అందజేసిన 170 గోమాత ఫోటోలను మండలంలోని వివిధ గ్రామాల భక్తులకు ఇప్పటికే పంపిణీ చేసినట్లు శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు వెల్లడించారు.