BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 09 July 2026, 08:02 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆర్యవైశ్య సంఘం నాయకులతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆత్మీయ సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jul, 2026 - 08:02 AM
107 వీక్షణలు

పల్నాడు జిల్లాకు చెందిన ఆర్యవైశ్య సంఘం ముఖ్య నాయకులతో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బుధవారం గుంటూరులోని తన కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సమాజానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.

సమావేశంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమం, అభివృద్ధికి అవసరమైన చర్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. నాయకుల విజ్ఞాపనలను శ్రద్ధగా విన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో అత్తులూరి సుబ్బారావు (పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు), కంభంపాటి అనిల్ (జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు), పాండురంగ శ్రీను (జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు), ఏవి గుప్తా (గురజాల పట్టణ టీడీపీ అధ్యక్షుడు), కనమర్లపూడి రమేష్ (చిలకలూరిపేట మాజీ కౌన్సిలర్), భవనాశ్రీ కిషోర్ (రాజుపాలెం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్), ఎస్‌పి‌ఆర్ కృష్ణ (కారంపూడి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు), చౌట శ్రీనివాసరావు (టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి), టీవీఎస్ సురేష్, రమేష్ (పిడుగురాళ్ల), సీహెచ్ నరసింహారావు (మాచవరం), లఘువరపు శివ పార్వతి సాంబశివరావు (పిల్లుట్ల)తో పాటు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.