BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 09 July 2026, 07:20 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉప్పలపాడులో రేషన్ షాపుపై విజిలెన్స్ తనిఖీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jul, 2026 - 07:20 AM
117 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

కామవరపుకోట మండలం ఉప్పలపాడులోని ప్రభుత్వ రేషన్ దుకాణాన్ని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ దుకాణంలోని రికార్డులను పరిశీలించి, బియ్యం తదితర నిత్యావసర సరుకుల నిల్వలు, పంపిణీ విధానాన్ని పరిశీలించారు.

అంత్యోదయ కార్డుదారులు, వృద్ధులు, వికలాంగులు తదితర లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేసే సరుకులను కూడా పరిశీలించారు.

లబ్ధిదారులైన వృద్ధులు, వికలాంగులను ఫోన్ ద్వారా సంప్రదించి రేషన్ పంపిణీ విధానం, సరుకుల నాణ్యత, పరిమాణం, డీలర్ సేవా విధానంపై ఆరా తీశారు. అలాగే రేషన్ దుకాణానికి వచ్చిన లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ప్రభుత్వం భారీ వ్యయంతో అమలు చేస్తున్న ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రతి లబ్ధిదారుడు సక్రమంగా వినియోగించుకోవాలని, రేషన్ సరుకుల అక్రమ రవాణా లేదా అక్రమ వాణిజ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదని డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ హితవు పలికారు.