BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 09 July 2026, 12:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jul, 2026 - 12:51 PM
261 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనా లక్షణాలతో మంగళవారం మృతి చెందడం కలకలం రేపింది.

మృతుల్లో ఒకరికి 43 సంవత్సరాలు, మరొకరికి 60 సంవత్సరాలకు పైగా వయస్సు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరికీ నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో, తుది నిర్ధారణ కోసం రక్త నమూనాలను పుణెలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

43 ఏళ్ల వ్యక్తి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, 60 ఏళ్లు పైబడిన మరో వ్యక్తి తమిళనాడులోని సీఎంసీ వెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది.