BREAKING
ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి
Date of Publish : 24 July 2026, 09:03 pm
Posted by : కూనురు మధు

గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో గోరింటాకు వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
24 Jul, 2026 - 09:03 PM
135 వీక్షణలు

గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో గోరింటాకు వేడుకలు

​నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం గోరింటాకు సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మన సంప్రదాయాలు, వాటి వెనుక ఉన్న వైజ్ఞానిక విశేషాలను విద్యార్థులకు తెలియజేసేందుకు  ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పాఠశాల డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు.


విద్యార్థినులు, ఈ సంబరాలలో ఉపాధ్యాయినులు ఉత్సాహంగా పాల్గొని విద్యార్థులకు సహజ సిద్ధమైన గోరింటాకును అలంకరిస్తూ  ఆషాడ మాసపు పాటలతో సందడి చేశారు. ​ఈ సందర్భంగా ఉపాధ్యాయినులు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గోరింటాకును గౌరీదేవి అనుగ్రహం, సౌభాగ్యానికి ప్రతీకగా గోరింటాకును భావిస్తారని తెలిపారు. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి, శరీరంలో వేడిని తగ్గించడానికి గోరింటాకు సహజసిద్ధమైన  ఔషధంగా పనిచేస్తుందని తెలిపారు.  దీని వెనుక ఉన్న శాస్త్రీయతను వివరించారు. ప్రస్తుత కాలంలో  ​రసాయన కోన్లకు దూరంగా ఉండి, ప్రకృతిసిద్ధమైన ఆచారాలను కాపాడుకోవాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు