సూరంపాలెంలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా, అన్నసమారాధన నిర్వహించిన దెశిరెడ్డి రాఘవరెడ్డి దంపతులు
సూరంపాలెం: ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కోఆపరేటివ్ యూనియన్ మాజీ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి–హైమావతి దంపతుల ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసి స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. అనంతరం భక్తులు, గ్రామస్తుల కోసం అన్నసమారాధన ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
భక్తి, ఆధ్యాత్మికతతో అలరించిన ఆలయ ప్రాంగణం
హనుమాన్ చాలీసా పారాయణంతో ఆలయ పరిసరాలు భక్తి వాతావరణంతో మార్మోగాయి. భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.