మరీదు శివరామకృష్ణకు ఘన సత్కారం పెద్దపూడి–కూచిపూడిలో మరీదు శివరామకృష్ణకు ఘన సత్కారం
పామర్రు: నియోజకవర్గంలోని పెద్దపూడి–కూచిపూడిలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లచ్చన్నకు ఆత్మీయులైన కోనకళ్ల గణపతి జ్ఞాపకార్థం ఆయన కుమారులు, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి, మాజీ ఎంపీ కోనకళ్ల నారాయణరావు, రాష్ట్ర బీసీ నాయకుడు కోనకళ్ల బుల్లయ్య బహూకరించిన లచ్చన్న జ్ఞాపికను ప్రత్యేకంగా అందజేశారు.
లచ్చన్న మనుమరాలు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి చేతుల మీదుగా నూజివీడు మండలం పాత రావిచర్ల గ్రామానికి చెందిన ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణకు లచ్చన్న జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా మరీదు శివరామకృష్ణను ఘనంగా సత్కరించారు. లచ్చన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న వారిని గుర్తించి గౌరవించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘం ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.