BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 08 September 2026, 05:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై రాజకీయ కుట్ర సాగదు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Sep, 2026 - 05:19 PM
5 వీక్షణలు

షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై రాజకీయ కుట్ర సాగదు  ఎమ్మెల్యే వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు

బడుగు వర్గాల ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు తగవు

పింకీల బలుపు చర్యలకు భయపడేది లేదు: కాంగ్రెస్ నేతలు

షాద్‌నగర్: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ రాజకీయంగా ఆయనను దెబ్బతీయాలని చూస్తున్న బీఆర్ఎస్ శ్రేణుల ప్రయత్నాలు సాగబోవని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, కాంగ్రెస్ గిరిజన ఆదివాసీ సమన్వయకర్త రఘునాయక్ స్పష్టం చేశారు.

మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ.. అసెంబ్లీకి హాజరుకాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ప్రశ్నిస్తూ, దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ ఫామ్‌హౌస్ ఎదుట చావు డప్పు కొడతామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను కొందరు సోషల్ మీడియా వేదికగా వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలను తప్పుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని, రాజకీయంగా ఆయన ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ప్రచారం సాగుతోందని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణుల దౌర్జన్యాలు, గూండాయిజం మితిమీరుతున్నాయని విమర్శించారు.

మహిళా ప్రజాప్రతినిధులను అడ్డం పెట్టుకుని అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పోలీసులతో వ్యవహరించిన తీరును వారు తప్పుబట్టారు. హరీశ్ రావు, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వ్యవహరించిన తీరు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. మహిళా పోలీసుల పట్ల కూడా అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు.

కేసీఆర్ ఫామ్‌హౌస్ ఎదుట దళితులు చౌడపు మోగిస్తారని ఎమ్మెల్యే చెప్పిన వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పని మాటలను ఆయనకు అంటగట్టి విమర్శలు చేయడం సరికాదన్నారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోలింగ్‌ను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

బడుగు, బలహీన వర్గాలకు చెందిన వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యేగా ఎదగడాన్ని కొందరు జీర్ణించుకోలేక ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వారు విమర్శించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి, ప్రజా సేవ గురించి ప్రజలను అడిగితే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. ఏ పార్టీ నేతల సామర్థ్యం ఎంత అనేది ప్రజలకు తెలుసన్నారు.

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై అవాకులు, చవాకులు పేల్చినా కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. దిష్టిబొమ్మలు దహనం చేయడం, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఇలాంటి బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ భయపడదని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ శ్రేణుల వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని వారు అన్నారు. భవిష్యత్తులో ఎవరికి ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.