BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 08 September 2026, 06:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో విద్యుత్ విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Sep, 2026 - 06:02 PM
19 వీక్షణలు

2,100 విద్యుత్ సర్వీసుల పరిశీలన.. 411 సర్వీసుల్లో అదనపు వినియోగం గుర్తింపు

666 కిలోవాట్ల అదనపు విద్యుత్ వినియోగానికి రూ.13.32 లక్షల జరిమానా

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు టౌన్ సెక్షన్ పరిధిలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. తిరువూరు టౌన్, కోకిలంపాడు, మల్లెల, రామన్నపాలెం, కాకర్ల, లక్ష్మీపురం ప్రాంతాల్లో మొత్తం 35 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో భాగంగా 1,843 గృహ విద్యుత్ సర్వీసులు, 253 వాణిజ్య సర్వీసులు.. మొత్తం 2,100 సర్వీసులను అధికారులు పరిశీలించారు. ఇందులో 411 సర్వీసుల్లో అదనపు విద్యుత్ వినియోగాన్ని గుర్తించారు. మొత్తం 666 కిలోవాట్ల విద్యుత్ వినియోగానికి సంబంధించి సుమారు రూ.13.32 లక్షల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.

అనంతరం లక్ష్మీపురంలో నిర్వహించిన సమావేశంలో అధికారులు మాట్లాడుతూ విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని పేర్కొన్నారు. విద్యుత్ చౌర్యానికి సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు 83310 14951, 83310 20537 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

విజిలెన్స్ ఈఈ విజయ్ కుమారి ఆధ్వర్యంలో, నూజివీడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. రాజామోహన్‌రావు, తిరువూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించారు. నూజివీడు డివిజన్ పరిధిలోని డిప్యూటీ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర విద్యుత్ శాఖ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.