BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 08 September 2026, 06:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోతనపల్లిలో పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Sep, 2026 - 06:37 PM
82 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి తిరువూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు.

చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన బాణావతు విజయ్ కుమార్, బాణావతు ధనలక్ష్మిని అరెస్ట్ చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎ. మస్తానయ్య తెలిపారు. గతంలో సారా తయారీదారులకు నల్లబెల్లం సరఫరా చేసిన కేసులో విజయ్ కుమార్ రెండో నిందితుడిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ధనలక్ష్మి గతంలో నాటుసారా తయారు చేస్తూ నేరస్థలం నుంచి పరారైనట్లు పేర్కొన్నారు.

ఏలూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కె. నాగ ప్రభు కుమార్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎ. అవులయ్య ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

అక్రమంగా నల్లబెల్లం నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం, నాటుసారా తయారీకి నల్లబెల్లం సరఫరా చేసే వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ మస్తానయ్య హెచ్చరించారు.