కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ డిమాండ్
కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ డిమాండ్: అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల:
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత సురేష్, పార్టీ ముఖ్య నాయకులు మరియు ప్రజాప్రతినిధులతో కలసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు మరియు ఇతర హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దురుసు ప్రవర్తనకు నిరసన
అనంతరం, నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి, పోలీసుల ప్రవర్తనకు నిరసనగా నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. మహిళా ప్రజాప్రతినిధులపై ఈ విధమైన వైఖరి ప్రజాస్వామ్యానికి మచ్చ అని, తక్షణమే సంబంధిత పోలీస్అ ధికారుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.