BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 08 September 2026, 04:46 pm
Posted by : DAVU RAVINDER REDDY

హైదరాబాద్‌లో వైద్యురాలి ఆత్మహత్య

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
08 Sep, 2026 - 04:46 PM
9 వీక్షణలు

కుషాయిగూడలో ఘటన.. మృతికి కారణాలపై పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్ | Ntoday News

హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. 28 ఏళ్ల వైద్యురాలు కీర్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

కుషాయిగూడ ఎస్‌ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతికి చెందిన డాక్టర్ కీర్తికి ఇటీవల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాఘవతో వివాహమైంది. దంపతులు కుషాయిగూడ పరిధిలోని వైష్ణవి ఎన్‌క్లేవ్‌లో అద్దెకు ఉంటున్నారు. కీర్తి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత రెండేళ్లుగా వైద్యురాలిగా పనిచేస్తోంది.

సోమవారం సాధారణంగా ఉదయం 8 గంటలలోపు విధులకు వెళ్లాల్సిన కీర్తి ఇంటి నుంచి బయటకు రాలేదు. దీనిని గమనించిన ఇంటి యజమాని ఆమెను పిలిచినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చింది. ఆమె తన సోదరుడితో కలిసి ఇంటి తలుపు తెరిచి చూడగా కీర్తి వంటగదిలో ఆత్మహత్యకు పాల్పడిన స్థితిలో కనిపించింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కీర్తి తల్లిదండ్రులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కీర్తి మృతికి గల కారణాలు తల్లిదండ్రులు వచ్చిన అనంతరం మరింత స్పష్టమయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.