BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 08 September 2026, 04:39 pm
Posted by : DAVU RAVINDER REDDY

మీ-సేవ కేంద్రాలకు దరఖాస్తులు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
08 Sep, 2026 - 04:39 PM
11 వీక్షణలు

ఉప్పల్‌లో 5 నూతన మీ-సేవ కేంద్రాలు
ఈ నెల 17 వరకు దరఖాస్తుల స్వీకరణ.. డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి
అర్హతలు ఇవే..

హైదరాబాద్ | Ntoday News

ఉప్పల్ పరిధిలో ఐదు నూతన మీ-సేవ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఇందుకోసం ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 17 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

నూతన మీ-సేవ కేంద్రాలను నెహ్రూనగర్ (నాచారం సర్కిల్), భవానీనగర్ (మల్లాపూర్ సర్కిల్), చిలకానగర్ (ఉప్పల్ సర్కిల్), మోహన్‌నగర్ (కొత్తపేట), నాగోల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు.

మీ-సేవ కేంద్రాల నిర్వహణకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ప్రాంతానికి స్థానికులై ఉండడంతో పాటు కనీసం డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. కంప్యూటర్‌పై పూర్తి అవగాహన తప్పనిసరిగా ఉండాలని అధికారులు తెలిపారు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష, మౌఖిక పరీక్ష నిర్వహించనున్నారు. పేదలు, దివ్యాంగులు, ఇతర సామాజిక వర్గాలకు సాధ్యమైనంత ప్రాధాన్యం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (PCC) సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తులు ఎక్కడ లభిస్తాయి?

అభ్యర్థులు దరఖాస్తు ఫారాలను అధికారిక జిల్లా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అర్హత ఉన్న అభ్యర్థులు గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యంత్రాంగం సూచించింది.