BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 08 September 2026, 04:36 pm
Posted by : DAVU RAVINDER REDDY

గణేశ్ ఉత్సవాలు.. వారికి సెలవులు రద్దు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
08 Sep, 2026 - 04:36 PM
11 వీక్షణలు

గణేశ్ ఉత్సవాల వేళ TGSPDCL సిబ్బంది సెలవులు రద్దు

సెప్టెంబర్ 14–25 వరకు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఎండీ జితేశ్ వి. పాటిల్ ఆదేశం

హైదరాబాద్ | Ntoday News

హైదరాబాద్‌లో సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు జరగనున్న గణేశ్ ఉత్సవాల సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా కోసం TGSPDCL సిబ్బందికి సాధారణ సెలవులను రద్దు చేసినట్లు సంస్థ ఎండీ జితేశ్ వి. పాటిల్ తెలిపారు.

గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల సమయంలో నగరవ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు, సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

ప్రధాన నిమజ్జన కేంద్రాలు, గణేశ్ విగ్రహాల ఊరేగింపు మార్గాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

నిమజ్జన ఊరేగింపులు సజావుగా సాగేలా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తదితర విద్యుత్ వ్యవస్థలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.

గణేశ్ ఉత్సవాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎండీ జితేశ్ వి. పాటిల్ ఆదేశించారు.