BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 08 September 2026, 06:35 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వరంగల్ రైల్వే స్టేషన్‌లో తప్పిపోయిన బాలుడు కుటుంబ సభ్యులకు అప్పగింత

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
08 Sep, 2026 - 06:35 PM
7 వీక్షణలు

వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్‌లో ఈ నెల 3న తప్పిపోయిన బాలుడిని జీఆర్పీ పోలీసులు గుర్తించి రక్షించారు. అనంతరం బాలుడి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని, మంగళవారం తండ్రి జితేందర్‌కు అప్పగించారు.

బిహార్‌కు చెందిన జితేందర్ తన భార్య, పిల్లలతో కలిసి ఉపాధి కోసం తమిళనాడుకు రైలులో ప్రయాణిస్తున్నాడు. రైలు వరంగల్ రైల్వే స్టేషన్‌లో ఆగిన సమయంలో నీరు తాగేందుకు బాలుడు రైలు నుంచి దిగాడు. అయితే రైలు బయలుదేరే సమయంలో తిరిగి ఎక్కలేకపోవడంతో బాలుడు స్టేషన్‌లో ఒంటరిగా మిగిలిపోయాడు.

బాలుడిని గమనించిన జీఆర్పీ పోలీసులు అతడిని రక్షించి, కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం వివరాలు సేకరించారు. ఈ క్రమంలో బాలుడి తండ్రి జితేందర్ వరంగల్ చేరుకోవడంతో పోలీసులు బాలుడిని సురక్షితంగా అతడికి అప్పగించారు. బాలుడిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించడంతో తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.