తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
భక్తి
- ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం
- హుండీ ఆదాయం రూ.2.66 కోట్లు
- దర్శనానికి పట్టే సమయం
- నిన్నటి శ్రీవారి దర్శన వివరాలు
తిరుమల | అక్టోబర్ 22 | ఎన్ టుడే న్యూస్: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టీటీడీ సమాచారం ప్రకారం వివిధ దర్శనాలకు సుమారు ఈ మేరకు సమయం పడుతోంది.
ఉచిత సర్వదర్శనం: సుమారు 6 గంటలు
టైమ్‌స్లాట్ (SSD) టోకెన్ల దర్శనం: సుమారు 3 గంటలు
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం: సుమారు 2 గంటలు
అక్టోబర్ 21న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల వివరాలు:
మొత్తం దర్శనం చేసుకున్న భక్తులు: 73,226 మంది
తలనీలాలు సమర్పించిన భక్తులు: 24,754 మంది
హుండీ ఆదాయం: రూ.2.66 కోట్లు
భక్తులు తమ దర్శన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల యాత్రను ప్రణాళిక చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఓం నమో వేంకటేశాయ! సర్వేజనాః సుఖినోభవంతు! 🙏