BREAKING
thumb ● Nalgonda: ఉపాధ్యాయులు లేకుండా శర్భాపురం ప్రాథమిక పాఠశాల thumb ● గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా ఉప్పలమ్మ పండుగ thumb ● ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 66 పోలింగ్ కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు thumb ● చదళ్ళ సమీపంలో ప్రధాన రహదారిపై ప్రమాదకర కాలువ.. ప్రయాణికుల ఆందోళన thumb ● మహా పాదయాత్రలో అయ్యప్ప స్వాములకు స్ఫూర్తి యోగ సభ్యుల సంఘీభావం thumb ● నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చకు అవకాశం thumb ● తెలంగాణ, ఏపీలో వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక thumb ● రాష్ట్రస్థాయి క్లాసికల్ డ్యాన్స్ పోటీల్లో రేణుశ్రీకి ద్వితీయ బహుమతి thumb ● ఇంట్లో బంగారు పుస్తెలతాడు మాయం.. ఆరు నెలల వ్యవధిలో రెండోసారి చోరీ ఫిర్యాదు thumb ● Nalgonda: ఉపాధ్యాయులు లేకుండా శర్భాపురం ప్రాథమిక పాఠశాల thumb ● గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా ఉప్పలమ్మ పండుగ thumb ● ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 66 పోలింగ్ కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు thumb ● చదళ్ళ సమీపంలో ప్రధాన రహదారిపై ప్రమాదకర కాలువ.. ప్రయాణికుల ఆందోళన thumb ● మహా పాదయాత్రలో అయ్యప్ప స్వాములకు స్ఫూర్తి యోగ సభ్యుల సంఘీభావం thumb ● నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చకు అవకాశం thumb ● తెలంగాణ, ఏపీలో వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక thumb ● రాష్ట్రస్థాయి క్లాసికల్ డ్యాన్స్ పోటీల్లో రేణుశ్రీకి ద్వితీయ బహుమతి thumb ● ఇంట్లో బంగారు పుస్తెలతాడు మాయం.. ఆరు నెలల వ్యవధిలో రెండోసారి చోరీ ఫిర్యాదు
Test 4
Date of Publish : 05 November 2026, 12:54 pm
Posted by : PAGADALA DEVAIAH

82 ఏళ్ల వృద్ధురాలికి విజయవంతంగా రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
05 Nov, 2026 - 12:54 PM
3 వీక్షణలు

చంపాపేట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్‌లో చికిత్స.. శస్త్రచికిత్స అనంతరం నడవగలిగిన కౌసల్య

హైదరాబాద్, నవంబర్ 5 (ఎన్ టుడే న్యూస్): చంపాపేట్‌లోని ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్‌లో 82 ఏళ్ల కౌసల్యకు రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. సీనియర్ రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బాలరాజు నాయుడు ఈ శస్త్రచికిత్స చేపట్టారు.

మోకాళ్ల అరుగుదలతో ఇబ్బందులు

డాక్టర్ బాలరాజు నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కౌసల్య చాలా కాలంగా మోకాలి ఆర్థరైటిస్ (కీళ్ల అరుగుదల) సమస్యతో బాధపడుతున్నారు. నడవడానికి ఇబ్బంది పడటంతో పాటు రోజువారీ పనులు చేసుకోవడంలోనూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం ఆమె నడవగలిగారని వైద్యులు తెలిపారు.

వైద్యులకు కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు

కౌసల్య కుమారుడు, సీనియర్ డెంటల్ సర్జన్ డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ, తమ తల్లికి మెరుగైన వైద్య సేవలు అందించిన ఆసుపత్రి యాజమాన్యానికి, డాక్టర్ బాలరాజు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

గత 82 ఏళ్లలో తమ తల్లి ఎప్పుడూ ఆసుపత్రిలో చేరలేదని, ఈ వయసులో శస్త్రచికిత్స అనంతరం ఆమె కోలుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అత్యాధునిక వైద్య సదుపాయాలు

ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్‌లో ఆర్థోపెడిక్ రోబోటిక్స్, జపాన్ క్యాథ్ ల్యాబ్, జర్మన్ 128 స్లైస్ సీటీ స్కాన్, 1.5 టెస్లా ఎంఆర్ఐ వంటి ఆధునిక వైద్య సాంకేతిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఆసుపత్రి వివరాలు: ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్, హైదరాబాద్.