BREAKING
thumb ● Nalgonda: ఉపాధ్యాయులు లేకుండా శర్భాపురం ప్రాథమిక పాఠశాల thumb ● గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా ఉప్పలమ్మ పండుగ thumb ● ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 66 పోలింగ్ కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు thumb ● చదళ్ళ సమీపంలో ప్రధాన రహదారిపై ప్రమాదకర కాలువ.. ప్రయాణికుల ఆందోళన thumb ● మహా పాదయాత్రలో అయ్యప్ప స్వాములకు స్ఫూర్తి యోగ సభ్యుల సంఘీభావం thumb ● నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చకు అవకాశం thumb ● తెలంగాణ, ఏపీలో వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక thumb ● రాష్ట్రస్థాయి క్లాసికల్ డ్యాన్స్ పోటీల్లో రేణుశ్రీకి ద్వితీయ బహుమతి thumb ● ఇంట్లో బంగారు పుస్తెలతాడు మాయం.. ఆరు నెలల వ్యవధిలో రెండోసారి చోరీ ఫిర్యాదు thumb ● Nalgonda: ఉపాధ్యాయులు లేకుండా శర్భాపురం ప్రాథమిక పాఠశాల thumb ● గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా ఉప్పలమ్మ పండుగ thumb ● ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 66 పోలింగ్ కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు thumb ● చదళ్ళ సమీపంలో ప్రధాన రహదారిపై ప్రమాదకర కాలువ.. ప్రయాణికుల ఆందోళన thumb ● మహా పాదయాత్రలో అయ్యప్ప స్వాములకు స్ఫూర్తి యోగ సభ్యుల సంఘీభావం thumb ● నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చకు అవకాశం thumb ● తెలంగాణ, ఏపీలో వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక thumb ● రాష్ట్రస్థాయి క్లాసికల్ డ్యాన్స్ పోటీల్లో రేణుశ్రీకి ద్వితీయ బహుమతి thumb ● ఇంట్లో బంగారు పుస్తెలతాడు మాయం.. ఆరు నెలల వ్యవధిలో రెండోసారి చోరీ ఫిర్యాదు
Test 4
Date of Publish : 05 November 2026, 12:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిర మండలంలో ఆదర్శ గ్రామంగా ఇల్లూరు ఎంపిక

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Nov, 2026 - 12:56 PM
9 వీక్షణలు

కులమత, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి బాటలో గ్రామం.. సర్పంచ్ చేకూరి ఆదిలక్ష్మి కృషికి గుర్తింపు ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడంపై గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలు ఖమ్మం జిల్లా మధిర మండలంలోని ఇల్లూరు గ్రామం కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన పీఎం ఏజేఏవై (PM-AJAY) అమలులో భాగంగా ఆదర్శ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు చేస్తున్న కృషిని పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మధిర మండలంలో ఆదర్శ గ్రామంగా ఇల్లూరుకు గుర్తింపు లభించడం గ్రామ ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపింది. గ్రామ సర్పంచ్ చేకూరి ఆదిలక్ష్మి కులమతాలు, రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనుల అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని, ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడం తమ బాధ్యతను మరింత పెంచిందని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ చేకూరి ఆదిలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇల్లూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఇల్లూరును అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇల్లూరు గ్రామానికి ఈ గుర్తింపు రావడానికి కృషి చేసిన కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సర్పంచ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సహకరించిన జిల్లా, మండల స్థాయి అధికారులకు, గ్రామ అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మధిర మండలంలో నెంబర్ వన్ గ్రామంగా ఇల్లూరుకు గుర్తింపు లభించడం పట్ల సర్పంచ్‌తో పాటు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శ గ్రామంగా లభించిన గుర్తింపును నిలబెట్టుకుంటూ మరింత అభివృద్ధి సాధించాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.