ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 66 పోలింగ్ కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
66 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో తరలివెళ్లిన సిబ్బంది.. కేంద్రాలను పరిశీలించిన అధికారులు
(ఎన్ టుడే న్యూస్): మండల పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలోని 66 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది అవసరమైన ఎన్నికల సామగ్రితో తరలివెళ్లినట్లు ఎన్నికల అధికారి వి.ఆర్. రుద్ర, తహసీల్దార్ ఆర్.డి. రామచంద్రమూర్తి, ఎంపీడీవో పి.వి.ఆర్.కె. రాజు తెలిపారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు
ఈ సందర్భంగా ఆర్డీవో ఎం.వి.వి. సత్యనారాయణ, ఎన్నికల అధికారి వి.ఆర్. రుద్ర, తహసీల్దార్ ఆర్.డి. రామచంద్రమూర్తి, ఎంపీడీవో పి.వి.ఆర్.కె. రాజు వివిధ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.
వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు
వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు సులభంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ర్యాంపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఓటర్లు, ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు, సహకారం అందించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
Meta Keywords: MPTC Elections, ZPTC Elections, Election Arrangements, 66 Polling Stations, Election Staff, Returning Officer, RDO, Tahsildar, MPDO, Polling Station Facilities, Telangana Local Elections