BREAKING
thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి
Test 4
Date of Publish : 26 November 2026, 07:06 pm
Posted by : K MAHESH

నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
26 Nov, 2026 - 07:06 PM
22 వీక్షణలు

సీఎం రేవంత్ రెడ్డికి మెయిల్ ద్వారా వినతి.. నాయి బ్రాహ్మణ వినతుల వారోత్సవం ప్రారంభం

గార్ల, నవంబర్ 26:

తెలంగాణ రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక, రాజకీయ అభ్యున్నతికి ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది జంపాల విశ్వ డిమాండ్ చేశారు.

తెలంగాణ నాయి బ్రాహ్మణ యువజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో నిర్వహించిన నాయి బ్రాహ్మణ వినతుల వారోత్సవాన్ని జంపాల విశ్వ ప్రారంభించారు. యువజన ఐక్యవేదిక కోఆర్డినేటర్ జంపాల కార్తీక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, నాయి బ్రాహ్మణుల ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కార్యాలయానికి (సీఎంఓ) ఈ-మెయిల్ ద్వారా పంపించారు.

ఈ సందర్భంగా జంపాల విశ్వ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 4.33 లక్షలకు పైగా జనాభా కలిగిన నాయి బ్రాహ్మణుల సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. వారి సంక్షేమ పథకాల అమలు కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, వెంటనే పూర్తిస్థాయి పాలకమండలిని నియమించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 80 వేలకు పైగా సెలూన్ షాపులను ఆధునీకరించడంతో పాటు వృత్తిదారుల ఆర్థికాభివృద్ధి, విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రతి ఏటా రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రాంత నాయి బ్రాహ్మణులకు చట్టసభల్లో తగిన రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పోస్టులు, ఎన్నికల్లో నాయి బ్రాహ్మణులకు సముచిత ప్రాధాన్యత కల్పించి రాజకీయంగా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.

నాయి బ్రాహ్మణుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు వినతుల వారోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాయి బ్రాహ్మణులందరూ వ్యక్తిగతంగా, సంఘాల తరఫున పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రికి వినతిపత్రాలు పంపాలని పిలుపునిచ్చారు. ఈ-మెయిల్, పోస్టు, ప్రజావాణి లేదా ప్రత్యక్షంగా వినతిపత్రాలు అందించడం ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం గార్ల మండల అధ్యక్షుడు జంపాల సతీష్, సీనియర్ నాయకులు మంగళగిరి మాధవ్, నిడిగొండ సాంబ, సురభి వెంకటేష్, జంపాల విజ్ఞాన్, సురభి సాయి తదితరులు పాల్గొన్నారు.