BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 08:44 pm
Posted by : K MAHESH

మహిళా డిగ్రీ గురుకులాన్ని తక్షణమే మార్చాలి.. విద్యార్థినులకు సొంత భవనం కేటాయించాలి

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
27 Nov, 2026 - 08:44 PM
6 వీక్షణలు

హాస్టల్‌లో విద్యార్థిని ప్రసవించిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

ప్రిన్సిపాల్‌, సంబంధిత ఆర్సీవోలను సస్పెండ్ చేయాలి: డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్

మహబూబాబాద్, నవంబర్ 27:

మహబూబాబాద్ మహిళా డిగ్రీ గురుకుల హాస్టల్‌లో విద్యార్థిని ప్రసవించిన ఘటనపై డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తన బృందంతో కలిసి మహిళా డిగ్రీ గురుకులాన్ని సందర్శించిన ఆయన విద్యార్థినులతో మాట్లాడి, వారి సమస్యలు, ఆరోగ్య పరిస్థితి, కళాశాలలోని వసతులు, భద్రతా ఏర్పాట్లు, యాజమాన్య పర్యవేక్షణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ వివేక్ మాట్లాడుతూ.. విద్యార్థినులకు కనీస భద్రత కల్పించలేని పరిస్థితుల్లో మహిళా డిగ్రీ గురుకులం కొనసాగడం దారుణమని విమర్శించారు. హాస్టల్‌లోనే విద్యార్థిని ప్రసవించే పరిస్థితి రావడం అధికారుల పర్యవేక్షణ లోపానికి, యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. విద్యార్థినుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

మహిళా డిగ్రీ గురుకులాన్ని ప్రస్తుత ప్రదేశం నుంచి తక్షణమే మరో అనువైన ప్రాంతానికి తరలించాలని, విద్యార్థినులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన సొంత భవనాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. హాస్టల్‌లో విద్యార్థిని ప్రసవించిన ఘటనపై బాధ్యత వహించాల్సిన ప్రిన్సిపాల్‌తో పాటు సంబంధిత ఆర్సీవోలను సస్పెండ్ చేసి, సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.

విద్యార్థినుల భద్రత, ఆరోగ్యం, విద్యా హక్కుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే డీఎస్ఎఫ్ఐ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

డాక్టర్ వివేక్ వెంట ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమా నాయక్, సీనియర్ జర్నలిస్ట్ ఎనమాల కిరణ్ కుమార్, డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కెలోత్ సాయికుమార్, కోశాధికారి గుగులోతు సూర్య ప్రకాష్, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, ఎల్‌హెచ్‌పీఎస్ నాయకుడు శంకర్ నాయక్, డీఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు దేవేందర్, బానోత్ సాయి, రమేష్, చంద్రశేఖర్, సుమన్, సంతోష్, అజయ్, సీను, మురళి తదితరులు పాల్గొన్నారు.