BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 08:46 pm
Posted by : K MAHESH

పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
K Mahesh Munugodu Constituency
27 Nov, 2026 - 08:46 PM
5 వీక్షణలు

వలిగొండ, నవంబర్ 27:

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని పవిత్రాత్మ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో ‘వీవా–2026’ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా యాదాద్రి భువనగిరి జిల్లా ట్రస్మా అధ్యక్షుడు పాలకూర్ల వెంకటేశం, వలిగొండ పారిష్ ప్రీస్ట్ ఫాదర్ జోసెఫ్, పవిత్రాత్మ కాన్వెంట్ సుపీరియర్ సిస్టర్ రోజ్ థామస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాలకూర్ల వెంకటేశం మాట్లాడుతూ.. సుమారు 30 సంవత్సరాల క్రితం స్థాపించిన పవిత్రాత్మ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించి, వారు ఉన్నత స్థానాలకు చేరుకునేలా కృషి చేసిందని అన్నారు. పేద, అనాథ విద్యార్థులకు ఉచిత విద్య అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ సవిత విద్యా సంవత్సరంలో పాఠశాల సాధించిన ప్రగతి, చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన నివేదికను వివరించారు. ‘వీవా–2026’లో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.