BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 08:45 pm
Posted by : K MAHESH

యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
27 Nov, 2026 - 08:45 PM
5 వీక్షణలు

నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేసుకోవాలి: డివిజనల్ వ్యవసాయ అధికారి అజ్మీర శ్రీనివాసరావు

ఆలేరు, నెల్లికుదురు, నవంబర్ 27:

యాసంగి సీజన్‌లో రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగును తగ్గించి, ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని మహబూబాబాద్ డివిజనల్ వ్యవసాయ అధికారి అజ్మీర శ్రీనివాసరావు సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపికలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

శుక్రవారం నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాసంగి పంటల సాగు, సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అజ్మీర శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల కారణంగా రానున్న కాలంలో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, జొన్న, సజ్జ, పెసర, మినుము, కంది వంటి ఆరుతడి పంటలు, పప్పుధాన్యాల సాగును చేపట్టాలని రైతులకు సూచించారు. పప్పుధాన్యాల సాగుతో భూసారం కూడా మెరుగుపడుతుందని వివరించారు. రైతులకు సబ్సిడీపై అందించే పెసర విత్తనాలు అన్ని రైతు వేదికల్లో అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి ఉన్న రైతులు వాటిని తీసుకొని సాగు చేసుకోవచ్చని తెలిపారు.

వరి సాగు చేసి రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ సాగులో అవసరమైన మెలకువలు అనుసరించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గన్నా హరీష్, టెక్నికల్ ఏవో రాంజీ, మండల వ్యవసాయ అధికారి భూక్యా మహేందర్, ఇరిగేషన్ ఏఈ సుష్మా, ఏఈవో మణికంఠ, వెటర్నరీ లైవ్‌స్టాక్ అసిస్టెంట్ రాజేష్, పంచాయతీ కార్యదర్శి యాకుబ్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

NTODAY NEWS | ప్రతి క్షణం ప్రజల పక్షం