బిడ్డ నవ్వు కోసం వీల్‌చైర్‌తో సముద్రంలోకి.. తండ్రి ప్రేమకు హ్యాట్సాఫ్
జాతీయం
కన్నబిడ్డ ముఖంపై చిరునవ్వు చూడటానికి తండ్రి ఎంతటి కష్టాన్నైనా భరిస్తాడనడానికి ఈ దృశ్యం నిదర్శనంగా నిలుస్తోంది. నడవలేని స్థితిలో ఉన్న తన కుమార్తెను వీల్‌చైర్‌పై సముద్రపు నీటిలోకి తీసుకెళ్లిన ఓ తండ్రి.. అలల స్పర్శను ఆమెకు పరిచయం చేశాడు. సముద్రపు అలలు తాకుతుండగా బిడ్డ ముఖంలో కనిపించిన ఆనందాన్ని చూసి ఆ తండ్రి మురిసిపోయాడు. ఈ అపురూప దృశ్యానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు స్పష్టంగా తెలియకపోయినా.. బిడ్డ కోసం తండ్రి చూపించిన ఆప్యాయత, ప్రేమ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. “తండ్రి ప్రేమకు హద్దులుండవు” అంటూ పలువురు స్పందిస్తున్నారు.