BREAKING
thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Bayyaram : విద్యార్థి అమరవీరుల ఆశయాలే ఉద్యమాలకు స్ఫూర్తి thumb ● Bayyaram: అక్రమ బరైటీస్‌ రవాణాకు అటవీశాఖ అడ్డుకట్ట thumb ● దశాబ్దాల తర్వాత ఒక్కచోట చేరిన స్నేహబంధం thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Bayyaram : విద్యార్థి అమరవీరుల ఆశయాలే ఉద్యమాలకు స్ఫూర్తి thumb ● Bayyaram: అక్రమ బరైటీస్‌ రవాణాకు అటవీశాఖ అడ్డుకట్ట thumb ● దశాబ్దాల తర్వాత ఒక్కచోట చేరిన స్నేహబంధం
మంచి మాట
Date of Publish : 01 November 2026, 07:52 pm
Posted by : SHAIK CHAND BASHA

Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
01 Nov, 2026 - 07:52 PM
12 వీక్షణలు
  • 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ జనాలను సమీకరించారని ఆరోపణ
  • కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

పులివెందుల, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్):

పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఎన్నికల విధులకు ఆటంకం కలిగించేలా ఉందని టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్ రవి ఆరోపించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ పులివెందులకు వచ్చి జనాలను సమీకరించి ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు ఇబ్బందులు కలిగించారని విమర్శించారు.

పులివెందుల ప్రశాంతతకు భంగం కలిగించారని ఆరోపణ

జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి పులివెందులలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా ఉందని బీటెక్ రవి ఆరోపించారు. మహిళలను ముందుపెట్టి ప్రభుత్వంపై, అధికారులపై బురదజల్లేందుకు ప్రయత్నించారని విమర్శించారు.

జర్నలిస్టులను ఇబ్బంది పెట్టారని వ్యాఖ్య

నేషనల్ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులను ఇబ్బందులకు గురిచేసి, ఆ ఘటనకు సంబంధించిన నెపాన్ని తమపైకి నెట్టేందుకు ప్రయత్నించారని బీటెక్ రవి పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు తమను హౌస్ అరెస్ట్ చేశారని ఆరోపించారు.

కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు అందజేసినట్లు బీటెక్ రవి తెలిపారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు వెల్లడించారు.