Bayyaram: అక్రమ బరైటీస్ రవాణాకు అటవీశాఖ అడ్డుకట్ట
నగరం గ్రామ సమీపంలో ట్రాక్టర్ స్వాధీనం.. కేసు నమోదు
బయ్యారం, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్):
బయ్యారం మండలంలో అక్రమంగా బరైటీస్ ఖనిజాన్ని తరలిస్తున్న వాహనాలపై అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం నగరం గ్రామ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో బరైటీస్ ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఒక ట్రాక్టర్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల సంయుక్త తనిఖీలు
కొత్తపేట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామాదేవి, నగరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రామదాస్, బేస్ క్యాంపు సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్రమంగా ఖనిజాన్ని తరలిస్తున్న ట్రాక్టర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పీఓఆర్ నంబర్ 1980/40తో కేసు నమోదు
ఈ ఘటనపై పీఓఆర్ నంబర్ 1980/40 ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తదుపరి విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఖనిజాల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.