BREAKING
thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Bayyaram : విద్యార్థి అమరవీరుల ఆశయాలే ఉద్యమాలకు స్ఫూర్తి thumb ● Bayyaram: అక్రమ బరైటీస్‌ రవాణాకు అటవీశాఖ అడ్డుకట్ట thumb ● దశాబ్దాల తర్వాత ఒక్కచోట చేరిన స్నేహబంధం thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Bayyaram : విద్యార్థి అమరవీరుల ఆశయాలే ఉద్యమాలకు స్ఫూర్తి thumb ● Bayyaram: అక్రమ బరైటీస్‌ రవాణాకు అటవీశాఖ అడ్డుకట్ట thumb ● దశాబ్దాల తర్వాత ఒక్కచోట చేరిన స్నేహబంధం
మంచి మాట
Date of Publish : 01 November 2026, 07:12 pm
Posted by : KOLA MAHESH

Bayyaram : విద్యార్థి అమరవీరుల ఆశయాలే ఉద్యమాలకు స్ఫూర్తి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
01 Nov, 2026 - 07:12 PM
8 వీక్షణలు

నవంబర్ 5 నుంచి 11 వరకు విద్యాసంస్థల్లో వర్ధంతి సభలు నిర్వహించాలి: పీడీఎస్‌యూ

బయ్యారం, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్):

విద్యార్థి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నవంబర్ 5 నుంచి 11వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో వర్ధంతి సభలు నిర్వహించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బయ్యారం మండల కేంద్రంలోని పీహెచ్ఎం వసతి గృహంలో గోడపత్రికలను ఆవిష్కరించారు.

విద్యార్థుల త్యాగాలను స్మరించుకోవాలి

ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ మండల కార్యదర్శి ఎ.చరణ్ మాట్లాడుతూ.. శాస్త్రీయ విద్య, సమసమాజ స్థాపన, పేదలకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాల సాధన కోసం ఎంతోమంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు.

జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, దుస్సా చేరాలు, కోలా శంకర్, స్నేహలత, రంగవల్లి తదితర విద్యార్థి అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు.

విద్యార్థి వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి

కేంద్ర ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలను తిప్పికొడుతూ, విద్యార్థి అమరవీరుల ఆశయాలను సాధించేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని చరణ్ పిలుపునిచ్చారు. అమరవీరుల కలలను సాకారం చేసే దిశగా విద్యార్థులు ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు బి.జగదీష్, టి.గౌతమ్, బి.నిఖిల్, జగన్, గౌరీశంకర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.