BREAKING
thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి
Test 4
Date of Publish : 26 November 2026, 07:02 pm
Posted by : K MAHESH

యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
26 Nov, 2026 - 07:02 PM
20 వీక్షణలు

పంట అవశేషాలను కాల్చకుండా పర్యావరణాన్ని కాపాడాలి: జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర

దంతాలపల్లి, నవంబర్ 29:

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రాబోయే యాసంగి సీజన్‌లో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, ఆరుతడి పంటల సాగుకు రైతులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పంటల సాగు చేపట్టాలని కోరారు.

గురువారం పెద్ద ముప్పారం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ఖేతి బచావో అభియాన్’, ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. రాబోయే యాసంగి సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు. ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం తగ్గడం వల్ల నీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితులు ఉండవచ్చని తెలిపారు. అందువల్ల రైతులు నీటి వినియోగాన్ని తగ్గించే పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు.

ముఖ్యంగా పెసర, మినుము, కంది వంటి పప్పుధాన్యాలు, జొన్న, రాగి వంటి చిరుధాన్యాలు, నువ్వులు, వేరుశనగ వంటి నూనెగింజల పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పంటల మార్పిడి, పంటల వైవిధ్యాన్ని పాటించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు నేల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.

పంట అవశేషాలను కాల్చకుండా పర్యావరణాన్ని కాపాడాలి

వానాకాలం పంటల కోత అనంతరం పొలాల్లో మిగిలే పంట అవశేషాలను కాల్చవద్దని రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి సూచించారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, మిత్ర కీటకాలు నశించడంతో పాటు సహజ పోషకాలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని వివరించారు.

పంట అవశేషాలను నేలలో కలియదున్నడం ద్వారా సేంద్రియ పదార్థాల శాతం పెరిగి, నేల ఆరోగ్యం మరియు భూసారం మెరుగుపడతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్తులో పంటల దిగుబడికి ఉపయోగపడేలా రైతులు పంట అవశేషాల నిర్వహణపై శ్రద్ధ వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. వాహిని, వ్యవసాయ విస్తరణ అధికారి ఉదయ్ కిరణ్, పెద్ద ముప్పారం గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.