BREAKING
thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Bayyaram : విద్యార్థి అమరవీరుల ఆశయాలే ఉద్యమాలకు స్ఫూర్తి thumb ● Bayyaram: అక్రమ బరైటీస్‌ రవాణాకు అటవీశాఖ అడ్డుకట్ట thumb ● దశాబ్దాల తర్వాత ఒక్కచోట చేరిన స్నేహబంధం thumb ● New Delhi: ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ సమరభేరి thumb ● Palakurthi : పట్టభద్రులారా.. ఓటు హక్కును వినియోగించుకోండి thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Bayyaram : విద్యార్థి అమరవీరుల ఆశయాలే ఉద్యమాలకు స్ఫూర్తి thumb ● Bayyaram: అక్రమ బరైటీస్‌ రవాణాకు అటవీశాఖ అడ్డుకట్ట thumb ● దశాబ్దాల తర్వాత ఒక్కచోట చేరిన స్నేహబంధం thumb ● New Delhi: ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ సమరభేరి thumb ● Palakurthi : పట్టభద్రులారా.. ఓటు హక్కును వినియోగించుకోండి
మంచి మాట
Date of Publish : 01 November 2026, 06:34 pm
Posted by : KOLA MAHESH

లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
01 Nov, 2026 - 06:34 PM
30 వీక్షణలు

సంస్థాన్ నారాయణపురం మండలానికి సాగునీరు అందించాలని సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలానికి సాగునీరు అందించేందుకు శివన్నగూడెం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జాంగిర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ప్రాజెక్టు నుంచి గ్రామాల వరకు ర్యాలీ

శివన్నగూడెం ప్రాజెక్టు కట్ట నుంచి అంతంపేట, లచ్చమ్మగూడెం, చిల్లాపూర్ వావిల్లపల్లి గ్రామాల  వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా నాయకులు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని ప్రస్తావిస్తూ, పనులను వేగవంతం చేసి మండలంలోని రైతులకు సాగునీరు అందించాలని కోరారు.

రైతులకు సాగునీరు అందించాలి

లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తయితే సంస్థాన్ నారాయణపురం మండలంలోని రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని నాయకులు పేర్కొన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ప్రాజెక్టు నీరు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

పాల్గొన్న నాయకులు

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ జిల్లా సీపీఎం కార్యదర్శి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.