BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 21 September 2026, 08:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిర ఆర్‌కే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ దోర్నాల రామకృష్ణకు ఉత్తమ సేవా పురస్కారం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Sep, 2026 - 08:40 PM
21 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఆర్‌కే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, స్నేక్ క్యాచర్ డాక్టర్ దోర్నాల రామకృష్ణకు “భారత్ రక్తదాన్ ఉత్తమ సేవా పురస్కారం–2026” లభించింది.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పి.ఎస్. ఫంక్షన్ హాల్‌లో ఆదివారం భారత్ రక్తదాన్ సేవా మిషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలకు చెందిన రక్తదాతలు, సామాజిక సేవకులకు ఉత్తమ సేవా పురస్కారాలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 320 సార్లు రక్తదానం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిన ప్రపంచ స్థాయి రక్తదాత డాక్టర్ సంపత్ కుమార్, సర్వే నీడ్ సంస్థ వ్యవస్థాపకుడు గౌతమ్, కురిమేటి నవీన్ తదితరుల చేతుల మీదుగా డాక్టర్ దోర్నాల రామకృష్ణ పురస్కారాన్ని అందుకున్నారు.

డాక్టర్ దోర్నాల రామకృష్ణ మధిర పట్టణంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రులకు తరలించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి రక్తదాతల సహకారంతో రక్తాన్ని అందిస్తున్నారు. అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం, వివిధ కార్యక్రమాల్లో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి పేదలకు అందించడం, పాత బట్టలను సేకరించి అవసరమైన వారికి పంపిణీ చేయడం వంటి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అలాగే ఆర్‌కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆశ్రయం లేని వృద్ధులు, నిరుపేదలు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వసతి, ఆహారం, అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. స్నేక్ క్యాచర్‌గా అనేక విషసర్పాలను పట్టుకుని వాటిని సురక్షితంగా అడవుల్లోకి వదిలివేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నారు.

సామాజిక సేవా రంగంలో డాక్టర్ దోర్నాల రామకృష్ణ అందిస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. పురస్కారం అందించిన కే. నవీన్‌తో పాటు భారత్ రక్తదాన్ సేవా మిషన్ అసోసియేషన్ కమిటీ సభ్యులకు ఆర్‌కే ఫౌండేషన్ తరఫున డాక్టర్ దోర్నాల రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

తన సేవలను గుర్తించి పురస్కారం అందించడం మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులోనూ నిరుపేదలు, అనాథలు, ఆపదలో ఉన్న వారికి మరింత సేవ చేయడానికి కృషి చేస్తానని డాక్టర్ దోర్నాల రామకృష్ణ తెలిపారు. పురస్కారం అందుకున్న రామకృష్ణను సేవా సంస్థల ప్రతినిధులు, మిత్రులు, అభిమానులు, పట్టణ ప్రముఖులు అభినందించారు.