BREAKING
thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● గుండెపోటుతో మృతి చెందిన క్వారీ వాచ్ మెన్ thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● లద్దిగంలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● గుండెపోటుతో మృతి చెందిన క్వారీ వాచ్ మెన్ thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● లద్దిగంలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
Test 4
Date of Publish : 06 November 2026, 07:15 am
Posted by : K MAHESH

బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 07:15 AM
3 వీక్షణలు
  • ప్రహరీ గోడ లేక విద్యార్థులకు భద్రతా సమస్యలు
  • పాఠశాల ఆవరణలోకి పాములు, తేళ్లు, పందుల సంచారం..
  • అధికారుల నిర్లక్ష్యంపై సీపీఐ ఆందోళన

కేసముద్రం (ఎన్‌ టుడే న్యూస్‌): పాఠశాలకు ప్రహరీ గోడ లేక విద్యార్థులు, అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ మండల నాయకుడు మంద భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అమీనాపురం ప్రాథమిక పాఠశాల ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా మంద భాస్కర్ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఇదే పాఠశాల ఆవరణలో అంగన్‌వాడీ కేంద్రం కూడా నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రహరీ గోడ లేకపోవడంతో పాఠశాల ఆవరణలోకి పాములు, తేళ్లు వంటి విషపురుగులతో పాటు పందులు కూడా వస్తున్నాయని ఆరోపించారు. దీంతో విద్యార్థులు, అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులు, బాలింతలు భయంతో ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యను సుమారు ఐదు నెలల క్రితం మున్సిపాలిటీ వార్డుల సమావేశంలో కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్, విద్యాశాఖ అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు.

విద్యార్థుల భద్రత పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించడం బాధాకరమని పేర్కొంటూ, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మంద భాస్కర్ డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ నాయకులు జన్ను రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.