BREAKING
thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● గుండెపోటుతో మృతి చెందిన క్వారీ వాచ్ మెన్ thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● లద్దిగంలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● గుండెపోటుతో మృతి చెందిన క్వారీ వాచ్ మెన్ thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● లద్దిగంలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
Test 4
Date of Publish : 06 November 2026, 07:34 am
Posted by : K MAHESH

శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి.

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 07:34 AM
2 వీక్షణలు
  • శంకుస్థాపనకే పరిమితమైన మహిళా సంఘ భవనం..
  • నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి
  • కాట్రపల్లిలో నాలుగు నెలలుగా పెండింగ్‌..
  • అధికారుల నిర్లక్ష్యంపై ఎంసీపీఐ(యు) నేత గడ్డం నాగార్జున విమర్శలు

కేసముద్రం (ఎన్‌ టుడే న్యూస్‌): కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని ఎంసీపీఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యుడు గడ్డం నాగార్జున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాట్రపల్లి గ్రామం నుంచి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గడ్డం నాగార్జున మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మహిళా సంఘ భవనాలను మంజూరు చేసిందని, అందులో భాగంగా కాట్రపల్లి గ్రామానికి కూడా మహిళా సంఘ భవనం మంజూరైందని తెలిపారు. అయితే నాలుగు నెలల క్రితమే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు.

ఈ విషయంపై పలుమార్లు అధికారులకు తెలియజేసినా, గ్రామపంచాయతీ పాలకవర్గం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇటీవల ఇతర గ్రామాల నుంచి వచ్చిన సీసీలు, మహిళా సంఘ నాయకులతో ఏపీఎం కృష్ణమూర్తి కాట్రపల్లి గ్రామంలో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. మహిళా సంఘ భవనం అందుబాటులో లేకపోవడంతో మహిళలంతా పాఠశాల ఆవరణలో కటిక నేలపై కూర్చొని సమావేశం నిర్వహించుకోవాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం భవనాన్ని మంజూరు చేసి, శంకుస్థాపన చేసిన నాలుగు నెలలైనా నిర్మాణ పనులు ప్రారంభించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాట్రపల్లిలో మహిళా సంఘ భవన నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని గడ్డం నాగార్జున డిమాండ్ చేశారు.