BREAKING
thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● గుండెపోటుతో మృతి చెందిన క్వారీ వాచ్ మెన్ thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● లద్దిగంలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● గుండెపోటుతో మృతి చెందిన క్వారీ వాచ్ మెన్ thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● లద్దిగంలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
Test 4
Date of Publish : 06 November 2026, 07:31 am
Posted by : K MAHESH

చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 07:31 AM
7 వీక్షణలు
  • చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు
  • అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్షరాభ్యాసం, మొదటి ముద్ద కార్యక్రమాలు..
  • ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బానోత్ సునీత వెంకన్న

కేసముద్రం (ఎన్‌ టుడే న్యూస్‌): కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు రేకులతండా, 12వ వార్డులో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించిన అక్షరాభ్యాసం, మొదటి ముద్ద కార్యక్రమాలకు మున్సిపల్ చైర్‌పర్సన్ బానోత్ సునీత వెంకన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ తరాల వీరేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ కార్యక్రమాలను ప్రారంభించి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. మొదటి ముద్ద కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. చిన్నారుల విద్యాభ్యాసం, ఆరోగ్యం, పోషణలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు.

ప్రాథమిక పాఠశాలను సందర్శించిన చైర్‌పర్సన్

అనంతరం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలను చైర్‌పర్సన్ సందర్శించారు. ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో ఉన్న వసతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తెలిపిన సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బానోత్ దేవినాథ్ సింగ్, అంగన్‌వాడీ టీచర్లు దుర్గ, లలిత, ప్రభురాణి తదితరులు పాల్గొన్నారు.