సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు స్థలం కేటాయించాలని వినతి
తెలంగాణ
/
మేడక్
: నార్సింగి మండలంలోని వివిధ తండాలకు చెందిన గిరిజనులు తమ కులదైవంగా భావించే సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించడంతో పాటు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టేందుకు స్థలం కేటాయించాలని కోరుతూ ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించారు.
మండలంలోని ఐదు తండాలకు చెందిన ప్రజలు కలిసి ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను నిర్వహించేందుకు, జెండా ఆవిష్కరణకు అనువైన స్థలాన్ని కేటాయించాలని వారు కోరారు.
ఈ సందర్భంగా తమకు స్థలం కేటాయిస్తే ప్రతి సంవత్సరం జయంతి వేడుకలను నిర్వహించుకోవడంతో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శక్రు నాయక్, గోప్య నాయక్, భాష, మహేందర్ సింగ్, మోహన్, యాదగిరి, కిషన్ తదితరులు పాల్గొన్నారు.