BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 21 September 2026, 07:26 pm
Posted by : కూనురు మధు

రెడీ మిక్స్ ప్లాంట్‌ను తక్షణమే నిలిపివేయాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
21 Sep, 2026 - 07:26 PM
13 వీక్షణలు


NTODAY NEWS నల్గొండ 


నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ రెవెన్యూ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్‌ఎంసీ) ప్లాంట్‌ను తక్షణమే నిలిపివేసి, అనుమతులపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ మాదిగ సోమవారం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌కు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 843/ఊ/2లో పచ్చటి పంట పొలాల మధ్య ఆర్‌ఎంసీ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల దుమ్ము, దూళి, శబ్ద కాలుష్యంతో పాటు భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అలాగే ప్లాంట్ ప్రార్థనా మందిరం, మసీదుకు సమీపంలో ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీ తీర్మానం, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తదితర అనుమతులు లేకుండా ఏర్పాటు చేసినట్లు ఆరోపించారు. భూగర్భ జలాల శాఖ అనుమతులు, పర్యావరణ అనుమతులు, ప్రజాభిప్రాయ సేకరణ వంటి ప్రక్రియలు పాటించకుండా ఎత్తైన రేకుల ప్రహరీ గోడ, నిరంతర నీటి స్ప్రింకర్లు, చెట్ల పెంపకం వంటి చర్యలు చేపట్టకుండానే ప్లాంట్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సంబంధిత అన్ని శాఖల అనుమతులను పరిశీలించి, నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరిపి ప్లాంట్‌ను తక్షణమే నిలిపివేయాలని కలెక్టర్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు ముదిగొండ వెంకటేశ్వర్లు, నాయకులు నారపాక ఆంజనేయులు మాదిగ, అందుగుల ఆనంద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.