BREAKING
thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● కార్తీక మాసంలో శైవ క్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● కార్తీక మాసంలో శైవ క్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
Test 4
Date of Publish : 12 November 2026, 01:31 pm
Posted by : SEETHA KIRAN KUMAR

మీర్‌పేటలో మహిళ దారుణ హత్య

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
12 Nov, 2026 - 01:31 PM
2 వీక్షణలు

నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి హతమార్చిన దుండగులు.. నిందితుల కోసం పోలీసుల గాలింపు

మీర్‌పేట: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ దత్తునగర్‌లో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీలక్ష్మి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అరుణ్ కుమార్ భార్య అనిత (35)ను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు.

అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. అనిత నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి దుండగులు హతమార్చినట్లు గుర్తించారు. ఆమె మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటాన్ని పిల్లలు గుర్తించారు. వెంటనే తండ్రికి సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. హత్యకు సంబంధించిన వివరాలను సేకరించి కేసు నమోదు చేశారు. అనితను ఎవరు, ఎందుకు హత్య చేశారు? ఈ ఘటన వెనుక ఉన్న కారణాలేమిటి? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.