BREAKING
thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● కార్తీక మాసంలో శైవ క్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● కార్తీక మాసంలో శైవ క్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం
Test 4
Date of Publish : 12 November 2026, 01:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సోనియా గాంధీ ఆత్మకథ చదవాలి: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 01:48 PM
2 వీక్షణలు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ చరిత్ర, నాయకుల త్యాగాలు, ప్రజాసేవా ప్రస్థానాన్ని తెలుసుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సోనియా గాంధీ ఆత్మకథను తప్పనిసరిగా చదవాలని సూచించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో బుధవారం నిర్వహించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ రాజకీయ ప్రస్థానం, పార్టీ కోసం చేసిన త్యాగాలను మహేశ్ కుమార్ గౌడ్ కొనియాడారు. ఎన్నో సవాళ్లు, విమర్శలు ఎదురైనా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన ఆమె జీవితం కాంగ్రెస్ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సోనియా గాంధీపై రాజకీయంగా వస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆమె సేవలు, త్యాగాలను గుర్తించాలని అన్నారు. అదేవిధంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీలో నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.