BREAKING
thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● కార్తీక మాసంలో శైవ క్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● కార్తీక మాసంలో శైవ క్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం
Test 4
Date of Publish : 12 November 2026, 02:07 pm
Posted by : PEDDABOINA SRIKANTH

ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
12 Nov, 2026 - 02:07 PM
0 వీక్షణలు

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులపై చర్చ.. గ్రామాల్లో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణకు నిర్ణయం

హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు ఎల్కతుర్తి మండలంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల పరిధిలోని గ్రామాల్లో నీటి లభ్యత, తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఎల్కతుర్తి రైతు వేదికలో మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, యువత, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు.

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సమావేశంలో చర్చించారు. అవసరమైన చోట నీటి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధం చేయాలని సమీక్షించారు.

అలాగే వి.బి.జి. రాంజీ పనుల పురోగతి, వాటి అమలు తీరును కూడా సమీక్షించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో కార్యాచరణ రూపొందించడంపై చర్చించారు. రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాల్సిన అవసరాన్ని సమావేశంలో ప్రస్తావించారు.

.