పంజాగుట్టలో అదుపుతప్పిన XUV 700.. తప్పిన పెనుప్రమాదం
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్: పంజాగుట్టలో పెనుప్రమాదం తప్పింది. బేగంపేట నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న XUV 700 కారు లైఫ్‌స్టైల్ బిల్డింగ్ సమీపంలో అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
నియంత్రణ కోల్పోయిన కారు పల్టీలు కొడుతూ రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో మహిళా డ్రైవర్ ఒక్కరే ఉన్నట్లు సమాచారం. కారులో చిక్కుకున్న ఆమెను స్థానికులు బయటకు తీశారు. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
ప్రమాద సమయంలో కారు పక్కన ఇతర వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.