BREAKING
thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● బీసీ హాస్టల్‌లో వార్డెన్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన విద్యార్థులు thumb ● తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు thumb ● డిసెంబర్ 18 నుంచి 39వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ thumb ● Munugode: పదవుల కంటే మునుగోడు అభివృద్ధే ముఖ్యం: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి thumb ● Bayyaram: ఓపెన్ స్కూల్ ప్రవేశ దరఖాస్తుల గడువు ఈ నెల 12 వరకు పొడిగింపు thumb ● Srikalahasti: తొట్టంబేడు మండలంలో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం thumb ● తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిరడీ ప్రకాష్ ఎన్నిక thumb ● Breaking News: హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఆరు రౌండ్లు ఫైర్? thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● బీసీ హాస్టల్‌లో వార్డెన్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన విద్యార్థులు thumb ● తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు thumb ● డిసెంబర్ 18 నుంచి 39వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ thumb ● Munugode: పదవుల కంటే మునుగోడు అభివృద్ధే ముఖ్యం: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి thumb ● Bayyaram: ఓపెన్ స్కూల్ ప్రవేశ దరఖాస్తుల గడువు ఈ నెల 12 వరకు పొడిగింపు thumb ● Srikalahasti: తొట్టంబేడు మండలంలో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం thumb ● తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిరడీ ప్రకాష్ ఎన్నిక thumb ● Breaking News: హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఆరు రౌండ్లు ఫైర్? thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి
మంచి మాట
Date of Publish : 02 November 2026, 12:19 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఆర్మీ లేదా పోలీసు అధికారిని హత్య చేసేందుకు కుట్ర..

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
02 Nov, 2026 - 12:19 PM
8 వీక్షణలు

నలుగురు భారతీయుల అరెస్ట్

పాకిస్థాన్ హ్యాండ్లర్‌తో కలిసి కుట్ర పన్నినట్లు యూపీ ఏటీఎస్‌ ఆరోపణ

అధికారిని హత్య చేసి వీడియో పంపితే రూ.3 లక్షలు ఇస్తామని ఒప్పందం

విదేశీ తయారీ పిస్టల్, 20 బుల్లెట్లు స్వాధీనం

ఉత్తరప్రదేశ్ (ఎన్ టుడే న్యూస్):

భారతదేశంలో ఆర్మీ అధికారి లేదా పోలీసు అధికారిని హత్య చేసేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఓ హ్యాండ్లర్ కుట్ర పన్నినట్లు ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (యూపీ ఏటీఎస్‌) వెల్లడించింది. ఈ కుట్రలో నలుగురు భారతీయులు భాగస్వాములుగా ఉన్నట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

హత్య చేసి వీడియో పంపితే రూ.3 లక్షలు

యూపీ ఏటీఎస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న రానా భాయ్ అనే హ్యాండ్లర్‌తో నలుగురు భారతీయులు సంప్రదింపులు జరిపినట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. ఆర్మీ అధికారి లేదా పోలీసు అధికారిని హత్య చేసి, ఆ దాడికి సంబంధించిన వీడియోను పాక్ హ్యాండ్లర్‌కు పంపితే రూ.3 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

నలుగురి అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం

ఈ కుట్రకు సంబంధించిన సమాచారంతో అప్రమత్తమైన యూపీ ఏటీఎస్‌ అధికారులు దర్యాప్తు చేపట్టి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని రజత్ కుమార్, గగన్‌దీప్ సింగ్, క్రిష్, ఒక మైనర్‌గా గుర్తించినట్లు వెల్లడించారు.

వారి నుంచి విదేశీ తయారీ పిస్టల్‌తో పాటు 20 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

పాక్ హ్యాండ్లర్‌తో సంబంధాలపై దర్యాప్తు

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న రానా భాయ్‌తో నిందితులు కలిసి కుట్ర పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందిందని అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా? నిందితులకు ఆయుధాలు ఎలా అందాయి? పాక్ హ్యాండ్లర్‌తో ఎలాంటి సంబంధాలు కొనసాగించారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.