BREAKING
thumb ● Srikalahasti: తొట్టంబేడు మండలంలో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం thumb ● తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిరడీ ప్రకాష్ ఎన్నిక thumb ● Breaking News: హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఆరు రౌండ్లు ఫైర్? thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Srikalahasti: తొట్టంబేడు మండలంలో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం thumb ● తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిరడీ ప్రకాష్ ఎన్నిక thumb ● Breaking News: హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఆరు రౌండ్లు ఫైర్? thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
మంచి మాట
Date of Publish : 02 November 2026, 09:27 am
Posted by : P GAJENDRA BABU

Srikalahasti: తొట్టంబేడు మండలంలో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
02 Nov, 2026 - 09:27 AM
8 వీక్షణలు

పలు గ్రామాల్లో పర్యటించిన జడ్పీటీసీ అభ్యర్థి రావిళ్ళ మునిరాజా నాయుడు

సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి

తొట్టంబేడు (ఎన్ టుడే న్యూస్):

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆశీస్సులతో తొట్టంబేడు మండల జడ్పీటీసీ అభ్యర్థి రావిళ్ళ మునిరాజా నాయుడు స్థానిక ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి మద్దతుగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

పలు గ్రామాల్లో ప్రచార పర్యటన

ఉదయం 9 గంటలకు దైనేడు గ్రామంలో ప్రారంభమైన ప్రచారం 10 గంటలకు పిల్లమేడు, 11 గంటలకు మామిడిగుంట గ్రామాలకు చేరుకుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు గొట్టిపూడి, 12.30 గంటలకు రాంబట్లపల్లి గ్రామాల్లో కొనసాగింది. ఆయా గ్రామాల్లో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు రావిళ్ళ మునిరాజా నాయుడుకు స్వాగతం పలికారు.

ప్రజలతో మమేకమై ప్రచారం

సాయంత్రం 3 గంటలకు కన్నలి గ్రామం, హరిజనవాడలో ప్రచారం నిర్వహించారు. 4 గంటలకు లక్ష్మీపురం, 4.30 గంటలకు కొత్త కండ్రిగ, 5 గంటలకు శివనాథపురం, 5.30 గంటలకు చిట్టత్తూరు, చివరగా 6.30 గంటలకు శివనాథపాలెం గ్రామంలో పర్యటించారు.

ప్రతి గ్రామంలోనూ ప్రజలను కలుసుకుంటూ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రచారానికి గ్రామాల నుంచి విశేష స్పందన లభించిందని పార్టీ నాయకులు తెలిపారు.

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా

ఈ సందర్భంగా రావిళ్ళ మునిరాజా నాయుడు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

మండలం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.