రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు తీవ్ర గాయాలు కాళ్లు తొలగించే అవకాశం ఉందన్న వైద్యులు కాళ్లలో మూడు బుల్లెట్లు.. తీవ్ర రక్తస్రావంతో చికిత్స
ఎన్ టుడే న్యూస్: అనంతపురం జిల్లా: రాప్తాడులో పదో తరగతి బాలికపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్ పోలీసులపై దాడికి యత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హేమంత్ ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్నాడు. వైద్యుల సమాచారం ప్రకారం, అతడి రెండు కాళ్లలో మూడు బుల్లెట్లు దిగినట్లు తెలుస్తోంది. ముఖానికి కూడా గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించడంతో పాటు ఆక్సిజన్ అందిస్తున్నారు. స్కానింగ్ నిర్వహించిన అనంతరం గాయాల తీవ్రతను అంచనా వేసి తదుపరి చికిత్స అందించనున్నట్లు వైద్యులు వెల్లడించారు. కాళ్లకు తీవ్రంగా గాయాలు కావడంతో వాటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. అయితే స్కానింగ్, తదుపరి వైద్య పరీక్షల అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.